sangeetha naadamutho sthothra sankeerthanathoసంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో
సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెద నీ గోప్ప కార్యం చాటెద నా జీవితం మార్చిన యేసయ్యా ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా ||సంగీత|| నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడెద (2) పాపములు క్షమియించి నను మార్చిన దోషములు భరియించి దరిచేర్చిన ||నీ ప్రేమ|| నా కష్ట సమయమున నా చెంతనే నిలచి విడువక నడిపించిన విధమును వివరించెద (2) క్షేమమును కలిగించి నను లేపిన దీవెనలు కురిపించి కృపచూపిన ||నీ ప్రేమ|| నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెద (2) వాక్యముతో దర్శించి బలపరిచిన సత్యముతో సంధించి స్థిరపరిచిన ||నీ ప్రేమ||
sangeetha naadamutho sthothra sankeerthanatho
nee prema geetham paadeda
nee goppa kaaryam chaateda
naa jeevitham maarchina yesayyaa
ee nee runam theerchuta etulayyaa ||sangeetha||
naa katina hrudayamuna kaarunyamunu nimpi
kaluvalu pooyinchina krupalanu koniyaadeda (2)
paapamulu kshamiyinchi nanu maarchina
doshamulu bhariyinchi dari cherchina ||nee prema||
naa kashta samayamuna naa chenthane nilachi
viduvaka nadipinchina vidhamunu vivarincheda (2)
kshemamunu kaliginchi nanu lepina
deevenalu kuripinchi krupa choopina ||nee prema||
naa dukha dinamulalo odaarpu kaliginchi
kanneetitho thudichina kramamunu prakatincheda (2)
vaakyamutho darshinchi balaparachina
sathyamutho sandhinchi sthiraparachina ||nee prema||