• waytochurch.com logo
Song # 13506

siluva saakshigaa yesu siluvanuసిలువ సాక్షిగా యేసు సిలువను



సిలువ సాక్షిగా యేసు సిలువను
సిలువ మోయుచు ప్రకటించెదను (2)
ఇదే నా వేదన – ఇదే నా ప్రార్థన ||సిలువ||
యేసు ఒళ్ళు చీల్చెను కుల కొరడా దెబ్బలే
క్రీస్తు తలను గుచ్చెను మత ముళ్ల కిరీటమే (2)
మేకులు దిగ గొట్టెను పదవి వ్యామోహమే
సిలువలో వ్రేలాడ దీసెను అధికారమే
కులమా కళ్ళు పొడచుకో – మతమా ఉరి పోసుకో ||సిలువ||
లోక పాప క్షమాపణ యేసు సిలువ రక్తమే
పాప శాప విమోచన యేసు సిలువ మార్గమే (2)
దైవమా నవ పాలన క్రీస్తు సిలువ జీవమే
సమ సమాజ స్థాపనలో యేసు సిలువ సత్యమే
కులమా కళ్ళు పొడచుకో – మతమా ఉరి పోసుకో ||సిలువ||

siluva saakshigaa yesu siluvanu
siluva moyuchu prakatinchedanu (2)
ide naa vedana – ide naa praarthana ||siluva||
yesu ollu cheelchenu kula koradaa debbale
kreesthu thalanu guchchenu matha mulla kireetame (2)
mekulu diga gottenu padavi vyaamohame
siluvalo vrelaada deesenu adhikaarame
kulamaa kallu podachuko – mathamaa uri posuko ||siluva||
loka paapa kshamaapana yesu siluva rakthame
paapa shaapa vimochana yesu siluva maargame (2)
daivamaa nava paalana kreesthu siluva jeevame
sama samaaja sthaapanalo yesu siluva sathyame
kulamaa kallu podachuko – mathamaa uri posuko ||siluva||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com