sweekarinchumayaa naathaa sweekarinchumayaaస్వీకరించుమయా నాథా స్వీకరించుమయా
స్వీకరించుమయా నాథా స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా స్వంతమేది నాది లేదు నిజాము నా దేవా నీ దానమైన జీవితమునే నీకు అర్పింతు ||స్వీకరించుమయా|| నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు నీవు చేసిన మేలంతా మదిని తలచుకొని (2) జీవదాయక ఈ బలిలో పాలి భాగ్యము నీవొసగి ప్రేమ యినెడి భాగ్యమును పంచిపెట్టుమయా ||స్వీకరించుమయా|| సుతుని ద్వారా పితకు నేనిల బలిని అర్పింతు ఆత్మ దేహములత్యంత అయోగ్యమైనవి (2) అమరమైన నీ ప్రేమతో నన్ను నింపుమయా పుణ్య జీవిత భాగ్యమును పంచిపెట్టుమయా ||స్వీకరించుమయా||
sweekarinchumayaa naathaa sweekarinchumayaa
ee deena janula kaanukalanu sweekarinchumayaa
swanthamedi naadi ledu nijamu naa deva
nee daanamaina jeevithamune neeku arpinthu ||sweekarinchumayaa||
naa kruthagnatha divya baligaa hrudayamarpinthu
neevu chesina melanthaa madini thalachukoni (2)
jeevadaayaka ee balilo paali bhaagyamu neevosagi
prema yinedi bhaagyamunu panchipettumayaa ||sweekarinchumayaa||
suthuni dwaaraa pithaku nenila balini arpinthu
aathma dehamulathyantha ayogyamainavi (2)
amaramaina nee prematho nannu nimpumayaa
punya jeevitha bhaagyamunu panchipettumayaa ||sweekarinchumayaa||