• waytochurch.com logo
Song # 13520

kshanikamaina brathukuraa idi sodaraaక్షణికమైన బ్రతుకురా ఇది సోదరా



క్షణికమైన బ్రతుకురా ఇది సోదరా
క్షణికమైన సుఖమురా ఇది (2)
ఓ స్నేహితుడా, ఓ స్నేహితుడా యోచించుమా
సృష్టికర్తను స్మరణ చేయుమా
దైవ ప్రేమను మదిని నిలుపుమా
ఆ యేసు ప్రేమను నీ మదిని నిలుపుమా ||క్షణికమైన||
ఎంత బ్రతికినా ఈ లోకమును విడిచిపెట్టి పోవలెను తెలుసా నీకు (2)
ఊరికి పోవు త్రోవ యెరుగుమయ్యా (2)
ఆ త్రొవే యేసని తెలుసుకొనుమయ్యా (2) ||ఓ స్నేహితుడా||
గడ్డిపువ్వును పోలిన బ్రతుకు ఎండి పోయి వాడి పోవు తెలుసా నీకు (2)
ఆవిరివంటి బ్రతుకు ఎగిరిపోవును (2)
ప్రభు యేసుని నమ్మితే నిత్యజీవము (2) ||ఓ స్నేహితుడా||

kshanikamaina brathukuraa idi sodaraa
kshanikamaina sukhamuraa idi (2)
o snehithudaa, o snehithudaa yochinchumaa
srushtikarthanu smarana cheyumaa
daiva premanu madini nilupumaa
aa yesu premanu nee madini nilupumaa ||kshanikamaina||
entha brathikinaa ee lokamunu vidichi petti povalenu thelusaa neeku (2)
ooriki povu throva yerugumayyaa (2)
aa throve yesani thelusukonumayyaa (2) ||o snehithudaa||
gaddi puvvunu polina brathuku endi poyi vaadi povu thelusaa neeku (2)
aaviri vanti brathuku egiripovunu (2)
prabhu yesuni nammithe nithya jeevamu (2) ||o snehithudaa||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com