• waytochurch.com logo
Song # 136

mahima neeke prabhu మహిమ నీకె ప్రభూ ఘనత నీకె ప్రభూ స్తుతీ ఘనత మహిమయు


పల్లవి:
మహిమ నీకె ప్రభూ - ఘనత నీకె ప్రభూ - స్తుతీ ఘనత మహిమయు
ప్రభావము నీకె ప్రభూ (2X) - ఆరాధనా, ఆరాధన (2X)
ప్రియ యేసు ప్రభునకే - నా యేసు ప్రభునకే (2X)

1.సమీపింప రాని - తేజస్సు నందు - వశియించు - అమరుండవే (2x)
శ్రీమంతుడవే - సర్వాధిపతివే - నీ సర్వము నా కిచ్చితివే (2x)
...ఆరాధన...

2.ఎంతో ప్రేమించి - నాకై ఏతెంచి - ప్రాణము నర్పించితివే (2x)
విలువైన రక్తం - చిందించి నన్ను - విమోచించితివే (2x)
...ఆరాధన...

3.ఆశ్చర్యకరమైన - నీ వెలుగులోనికి - నను పిలచి - వెలిగించితివే (2x)
నీ గుణాతిశయముల్ - ధరనే ప్రచురింప - ఏర్పరచుకొంటివే (2x)
...ఆరాధన...

4.రాజులైన యాజక - సమూ్ముగా - ఏర్పరచబడిన వంశమై (2x)
పరిశుద్ధజనమై - నీ సొత్తైన ప్రజగా - నన్ను జేసితివే (2x)
...ఆరాధన


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com