mangalame yesunaku మంగళమే యేసునకు మనుజావతారునకు3x
పల్లవి: మంగళమే యేసునకు - మనుజావతారునకు(3x) శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే ...మంగళమే... 1. పరమపవిత్రునకు - వరదివ్యతేజునకు(3x) నిరుపామనందునకు (2x)- నిపుణవైద్యునకు - మంగళమే ...మంగళమే... 2. దురిత సంహారునకు - వరసుగుణోద్ధారునకు (3x) కరుణా సంపన్నునకు (2x) - జ్ఞాన దీప్తునకు మంగళమే ...మంగళమే... 3. రాజులపై పాజునకు - రవి కోటి తేజునకు (3x) బూజార్హ పదాబ్జునకు (2x) - భువనావన మీకు మంగళమే ...మంగళమే... 4. సత్యప్రవర్తనకు - సద్ధర్మశీలునకు (3x) నిత్య స్వయం జీవునకు (2x) - నిర్మలాత్మునకు మంగళమే ...మంగళమే...