manulu manikyamulunna మణులు మాణిక్యములున్న మేడమిద్దెలు ఎన్నున్నా
పల్లవి: మణులు మాణిక్యములున్న - మేడమిద్దెలు ఎన్నున్నా మదిలొ యేసు లేకున్నా - ఏది వున్నా అది సున్నా 1. చదువులెన్నో చదివున్నా - పదవులెన్నో చేస్తున్నా విద్య వున్నా బుద్ది వున్నా - జ్ఞానమున్నా అది సున్నా ...మణులు... 2. అందచందా లెన్నున్నా - అందలముపై కూర్చున్నా సుందరుడగు ప్రభు లేకున్నా - అందమున్నా అది సున్నా ...మణులు... 3. రాజ్యములు రమణులున్నా - శౌర్యములు గల వీరులున్నా బలము వున్నా బలగమున్నా - ఎన్నియున్నా అవి సున్నా ...మణులు... 4 పూజ్యుడా పుణ్యాత్ముడా - పుణ్యకార్య సిద్దుడా దానధర్మము తపము జపము - యేసు లేనివి అన్నీ సున్నా ...మణులు...