naa jeevitha yatralo నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం
పల్లవి: నా జీవిత యాత్రలో - ప్రభువా నీ పాదమే శరణం ఈ లోకమునందు నీవు తప్ప - వేరె ఆశ్రయం లేదు (2x) ...నా జీవిత... 1. పలువిధ శొధన కష్టములు - ఆవరించుచుండగా (2x) కదలక యున్న నా హృదయమను - కదలక కాపాడుము ...నా జీవిత... 2. నీ సన్నీధిలో సంపూర్ణమైన - సంతోషము కలదు (2X) నీ కుడి హస్తము నాతో నుండన్ - నా జీవిత యాత్రలో ...నా జీవిత... 3. ఈలోక నటన ఆశలన్నీయు - తరిగిపోవుచుండగా (2X) మారని నీ వాగ్ధానములే - నమ్మి సాగిపోవుదునూ ...నా జీవిత...