naa sthuthi paathruda నా స్తుతి పాత్రుడా నా యెసయ్యా నా ఆరాధనకు
పల్లవి: నా స్తుతి పాత్రుడా నా యెసయ్యా - నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా ...నా స్తుతి... 1. నీ వాక్యమే - నా పరవశము - నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము నీ వాక్యమే నా పాదములకు దీపము (2x) ...నా స్తుతి... 2. నీ కృపయే - నా ఆశ్రయము - నీ కృపయే నా ఆత్మకు అభిషేకము నీ కృపయే నా జీవన ఆధారము (2x) ...నా స్తుతి... 3. నీ సౌందర్యము యెరుషలేము - నీ పరిపూర్ణత సీయోను శిఖరము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము (2x) ...నా స్తుతి...