nadipinchu na naava నడిపించు నా నావ నడి సంద్రమున దేవా
పల్లవి: నడిపించు నా నావ - నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున - నా జన్మ తరియింప ...నడిపించు... 1. నా జీవిత తీరమున - నా ఆపజయ భారమున నలిగిన నా హృదయమను - నడిపించుము లోతునకు నా యాత్మ విరబూయ - నా దీక్ష ఫలియింప నా నావలొ కాలిడుము - నా సేవ జేకొనుము ...నడిపించు... 2. రాత్రంతయు శ్రమపడినా - రాలేదు ప్రభూ జయము రహదారులు వెదకినను - రాదాయెను ప్రతిఫలము రాక్షించు నీ సిలువా - రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో - రాజిల్లు నా పడవ ...నడిపించు... 3. ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి అహమును ప్రేమించుచునే - అరసితి ప్రభు నీ కలిమి ఆశా నిరాశాయే - ఆవేదనెదురాయే ఆధ్యాత్మిక లేమిగని - అల్లాడె నా వలలో ...నడిపించు... 4. ప్రభు మార్గము విడచితిని - ప్రార్ధించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని - పరమార్ధము మరచితిని ప్రాపంచ నటనలలో - ప్రావీణ్యమును బొంది ఫలహీనుడనై ఇపుడు - పాటింతు నీ మాట ...నడిపించు... 5. లోతైన జలములలో - లోతున వినబడు స్వరమా లోబడుటకు నేర్పించి - లోపంబులు సవరించి లోనున్న ఈవులలో - లోటైన నా బ్రతుకున్ లోపించని యర్పణగా - లోకేశ చేయుమయా ...నడిపించు... 6. ప్రభు యేసుని శిష్యుడనై - ప్రభు ప్రేమలొ పాదుకొని ప్రకటింతును లోకములొ - పరిశుద్ధుని ప్రేమకధ పరమాత్మ ప్రోక్షణతో - పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభుకొరకు - పానార్పణము జేతు ...నడిపించు...