ne saagedha yesunitho నే సాగెద యేసునితో నా జీవిత కాలమంత
పల్లవి: నే సాగెద యేసునితో - నా జీవిత కాలమంత 1. యేసుతొ గడిపెద - యేసుతొ నడిచెద - పరమున చేరగ - నే వెళ్ళెదా (2X) హానోకు వలె సాగెదా.. ఆ... ...నే సాగెద... 2. వెనుక శత్రువులు - వెంటాడినను - ముందు సముద్రము - ఎదురొచ్చినా (2X) మోషె వలె సాగెదా.. ఆ... ...నే సాగెద... 3. లోకపు శ్రమలు - నన్నెదిరించిన - కఠినులు రాళ్ళతొ హింసించినా (2X) స్తెఫను వలె సాగెదా.. ఆ... ...నే సాగెద... 4. తల్లి మరచిన - తండ్రి విడచిన - బంధువులే నన్ను - వెలివేసినా (2X) బలవంతునితో సాగెదా.. ఆ... ...నే సాగెద... 5. బ్రతుకుట క్రీస్తు చావైన మేలే - క్రీస్తుకై హత సాక్షిగా మారినా (2X) పౌలు వలె సాగెదా.. ఆ... ...నే సాగెద...