• waytochurch.com logo
Song # 14562

alphaa omegayaina mahimaanvithudaaఅల్ఫా ఒమేగయైన మహిమాన్వితుడా


అల్ఫా ఒమేగయైన – మహిమాన్వితుడా
అద్వితీయ సత్యవంతుడా – నిరంతరం స్తోత్రార్హుడా (2)
రాత్రిలో కాంతి కిరణమా – పగటిలో కృపా నిలయమా
ముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమా
నాతో స్నేహమై నా సౌఖ్యమై
నను నడిపించే నా యేసయ్యా (2) ||అల్ఫా||

కనికర పూర్ణుడా – నీ కృప బాహుల్యమే
ఉన్నతముగా నిను ఆరాధించుటకు
అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి
నూతన వసంతములు చేర్చెను (2)
జీవించెద నీ కొరకే
హర్షించెద నీలోనే (2) ||అల్ఫా||

తేజోమయుడా – నీ దివ్య సంకల్పమే
ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు
ఆశ నిరాశల వలయాలు తప్పించి
అగ్ని జ్వాలగా నను చేసెను (2)
నా స్తుతి కీర్తన నీవే
స్తుతి ఆరాధన నీకే (2) ||అల్ఫా||

నిజస్నేహితుడా – నీ స్నేహ మాధుర్యమే
శుభ సూచనగా నను నిలుపుటకు
అంతులేని అగాధాలు దాటించి
అందని శిఖరాలు ఎక్కించెను (2)
నా చెలిమి నీతోనే
నా కలిమి నీలోనే (2) ||అల్ఫా||

alphaa omegayaina – mahimaanvithudaa
advitheeya sathyavanthudaa – nirantharam sthothraarhudaa (2)
raathrilo kaanthi kiranamaa – pagatilo krupaa nilayamaa
mudimi varaku nannaadarinche sathya vaakyamaa
naatho snehamai naa soukhyamai
nanu nadipinche naa yesayyaa (2) ||alphaa||

kanikara poornudaa – nee krupa baahulyame
unnathamuga ninu aaraadhinchutaku
anukshanamuna nee mukha kaanthilo nilipi
noothana vasanthamulu cherchenu (2)
jeevincheda nee korake
harshincheda neelone (2) ||alphaa||

thejomayudaa – nee divya sankalpame
aascharyakaramaina velugulo naduputaku
aasha niraashala valayaalu thappinchi
agni jwaalagaa nanu chesenu (2)
naa sthuthi keerthana neeve
sthuthi aaraadhana neeke (2) ||alphaa||

nija snehithudaa – nee sneha maadhuryame
shubha soochanagaa nanu niluputaku
anthuleni agaadhaalu daatinchi
andani shikharaalu ekkinchenu (2)
naa chelimi neethone
naa kalimi neelone (2) ||alphaa||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com