kondala thattu kanuletthuchunnaanuకొండల తట్టు కన్నులెత్తుచున్నాను
కొండల తట్టు కన్నులెత్తుచున్నాను
నాకు సాయమెచ్చట నుండి వచ్చును
భూమి యాకాశముల సృజించిన
యెహోవా వలన సాయము కల్గున్ ||కొండల||
నీ పాదము తొట్రిల్ల నీయడు
నిన్ను కాపాడువాడు కునుకడు ||కొండల||
ఇశ్రాయేలును కాచు దేవుడు
కునుకడు నిద్రపోడు యెన్నడు ||కొండల||
యెహోవాయే నిన్ను కాపాడును
కుడి ప్రక్క నీడగా నుండును ||కొండల||
పగటెండ రాత్రి వెన్నెల దెబ్బ
నీకు తగులకుండ కాపాడును ||కొండల||
ఎట్టి అపాయమైన రాకుండ
ఆయన నీ ప్రాణము కాపాడున్ ||కొండల||
ఇది మొదలుకొని నిత్యము నీ
రాకపోకలందు నిను కాపాడున్ ||కొండల||
kondala thattu kanuletthuchunnaanu
naaku saayamechchata nundi vachchunu
bhoomi yaakaashamula srujinchina
yehovaa valana saayamu kalgun ||kondala||
nee paadamu thotrillaneeyadu
ninnu kaapaaduvaadu kunukadu ||kondala||
ishraayelunu kaachu devudu
kunukadu nidrapodu ennadu ||kondala||
yehovaaye ninnu kaapaadunu
kudi prakka needagaa nundunu ||kondala||
pagatenda raathri vennela debba
neeku thagulakunda kaapaadunu ||kondala||
etti apaayamaina raakunda
aayana nee praanamu kaapaadun ||kondala||
idi modalukoni nithyamu nee
raakapokalandu ninu kaapaadun ||kondala||