nee challanaina needalo nannu nivasinchanee prabhuనీ చల్లనైన నీడలో నన్ను నివసించనీ ప్రభు
నీ చల్లనైన నీడలో నన్ను నివసించనీ ప్రభు
నీ పరిశుద్ధ పాదములే నన్ను తాకనీ ప్రభు (2)
నీ ప్రేమా నా లోనా (2)
ప్రతిక్షణం అనుభవించనీ (2) ||నీ చల్లనైన||
మట్టి వంటిది నా జీవితం
గాలి పొట్టు వంటిది నా ఆయుషు (2)
పదిలముగా నను పట్టుకొని (2)
మార్చుకుంటివా నీ పోలికలో (2)
మరణ భయమిక లేదంటివి (2) ||నీ చల్లనైన||
మారా వంటిది నా జీవితం
ఎంతో మదురమైనది నీ వాక్యం (2)
హృదయములో నీ ప్రేమా (2)
కుమ్మరించుమా జుంటి తేనెలా (2)
(ఆహా) మధురం మధురం నా జీవితం (2) ||నీ చల్లనైన||
అల్పమైనది నా జీవితం
ఎంతో ఘనమైది నీ పిలుపు (2)
నీ సేవలో నే సాగుటకు (2)
నను నింపుమా నీ ఆత్మ శక్తి తో (2)
నే ఆగక సాగెద నీ సేవలో (2) ||నీ చల్లనైన||
nee challanaina needalo nannu nivasinchanee prabhu
nee parishudhdha paadamule nannu thaakanee prabhu (2)
nee prema naa lonaa (2)
prathikshanam anubhavinchanee (2) ||nee challanaina||
matti vantidi naa jeevitham
gaali pottu vantidi naa aayushu (2)
padilamugaa nanu pattukoni (2)
maarchukuntivaa nee polikalo (2)
marana bhayaminka ledantivi (2) ||nee challanaina||
maaraa vantidi naa jeevitham
entho madhuramainadi nee vaakyam (2)
hrudayamulo nee premaa (2)
kummarinchumaa junti thenelaa (2)
(aahaa) madhuram madhuram naa jeevitham (2) ||nee challanaina||
alpamainadi naa jeevitham
entho ghanamainadi nee pilupu (2)
nee sevalo ne saagutaku (2)
nanu nimpumaa nee aathma shakthitho (2)
ne aagaka saageda nee sevalo (2) ||nee challanaina||