• waytochurch.com logo
Song # 14594

nee pada sevaye chaaluనీ పద సేవయే చాలు


నీ పద సేవయే చాలు
యేసు నాకదియే పది వేలు
నీ పద సేవయే చాలు
నీ పద జ్ఞానము నాకిలా క్షేమము
నీ పద గానము నాకిలా ప్రాణము (2) ||నీ పద||

నీ నామమునే స్తుతియింపగను
నీ వాక్యమునే ధ్యానింపగను (2)
నీ రాజ్యమునే ప్రకటింపగను (2)
దీవెన నాకిలా దయచేయుమా ||నీ పద||

నీ దరినే నివసింపగను
జీవమునే సాధింపగను (2)
సాతానును నే నెదిరింపగాను (2)
దీవెన నాకిలా దయచేయుమా ||నీ పద||

నీ ప్రేమను నే చూపింపగను
నీ త్యాగమునే నొనరింపగను (2)
నీ సహనమునే ధరియింపగను (2)
దీవెన నాకిలా దయచేయుమా ||నీ పద||

nee pada sevaye chaalu
yesu naakadiye padi velu
nee pada sevaye chaalu
nee pada gnaanamu naakila kshemamu
nee pada gaanamu naakila praanamu (2) ||nee pada||

nee naamamune sthuthiyimpaganu
nee vaakyamune dhyaanimpaganu (2)
nee raajyamune prakatimpaganu (2)
deevena naakila dayacheyumaa ||nee pada||

nee darine nivasimpaganu
jeevamune saadhimpaganu (2)
saathaanunu ne nedirimpaganu (2)
deevena naakila dayacheyumaa ||nee pada||

nee premanu ne choopimpaganu
nee thyaagamune nonarimpaganu (2)
nee sahanamune dhariyimpaganu (2)
deevena naakila dayacheyumaa ||nee pada||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com