nee chethitho nannu pattuko నీ చేతితో నన్ను పట్టుకో నీఆత్మతో నన్ను నడుపు
పల్లవి: నీ చేతితో నన్ను పట్టుకో - నీఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో సిలను నేను - అనుక్షణము నన్ను చెక్కుము (2x) 1. అంధకార లోయలొన - సంచరించిన భయము లేదు నీ వాక్యము శక్తిగలది - నా త్రోవకు నిత్యవెలుగు (2X) 2. ఘోర పాపిని నేను తండ్రి - పాప యూబిలో పడియుంటిని లేవనెత్తుము శుద్ధిచేయుము - పొందనిమ్ము నీదు ప్రేమను (2X) 3. ఈ భువిలో రాజు నీవే - నా హృదిలో శాంతినీవే కుమ్మరించుము నీదు ఆత్మను - జీవితాంతము సేవచేసెదన్ (2X) ...నీ చేతితో...