neevu thadithe thalupu theeyanaa prabhuనీవు తడితే తలుపు తీయనా ప్రభు
నీవు తడితే తలుపు తీయనా ప్రభు
నాలో నీవుంటే ఇంకేల నాకు భయం (2) ||నీవు||
పాపముతో నిండియున్న నా బ్రతుకును
పరిశుద్ధ పరిచావు నా యేసయ్యా
పాపములో జీవించుచున్న నాపై
ప్రేమ చూపి నా తలుపు తట్టావయ్యా (2)
నా చీకటి బ్రతుకులో వెలుగును నింపి
నన్ను నడిపించగ వచ్చావయ్యా (2) ||నీవు||
తెరిచాను నా తలుపులు రావా ప్రభు
ఇక నన్ను వీడి నిన్ను వెళ్లనివ్వను
నాలోన నీవుండి పోవాలి
నీతోనే నడవాలి ఇక మీదట (2)
రక్షణనే కేడెము చేత పట్టి
ప్రతి తలుపును తట్టి నిన్ను మహిమ పరచెద (2) ||నీవు||
విలువలేని నన్ను నీవు ఎంచుకొంటివి
వాక్యమనే ధ్యానముతో నన్ను నింపుమా
స్వస్థతనే వరముల దయచేయుమా
కడ వరకు పరుగెడుదును నీ బాటలో (2)
ఎల్లవేళలా నాతో ఉండి నన్ను
చేయి పట్టి నడిపించు నా యేసయ్యా (2) ||నీవు||
neevu thadithe thalupu theeyanaa prabhu
naalo neevunte inkela naaku bhayam (2) ||neevu||
paapamutho nindiyunna naa brathukunu
parishuddha parichaavu naa yesayyaa
paapamulo jeevinchuchunna naapai
prema choopi naa thalupu thattaavayyaa (2)
naa cheekati brathukulo velugunu nimpi
nannu nadipinchaga vachchaavayyaa (2) ||neevu||
therichaanu naa thalupulu raavaa prabhu
ika nannu veedi ninnu vellanivvanu
naalona neevundi povaali
neethone nadavaali ika meedata (2)
rakshanane kedemu chetha patti
prathi thalupunu thatti ninnu mahima paracheda (2) ||neevu||
viluvaleni nannu neevu enchukontivi
vaakyamane dhyaanamutho nannu nimpumaa
swasthathane varamula dayacheyumaa
kada varaku parugedudunu nee baatalo (2)
ella velalaa naatho undi nannu
cheyi patti nadipinchu naa yesayyaa (2) ||neevu||