paradeshulamo priyulaaraa manaపరదేశులమో ప్రియులారా మన
పరదేశులమో ప్రియులారా మన
పురమిది గాదెపుడు (నిజముగ) (2) ||పరదేశుల||
చిత్ర వస్తువులు చెల్లెడి యొకవి
చిత్రమైన సంత (లోకము) (2) ||పరదేశుల||
సంత గొల్లు క్షమ సడలిన చందం
బంతయు సద్దణగన్ (నిజముగ) (2) ||పరదేశుల||
స్థిరమని నమ్మకు ధర యెవ్వరికిని
బరలోకమే స్థిరము (నిజముగ) (2) ||పరదేశుల||
మేడలు మిద్దెలు మేలగు సరకులు
పాడై కనబడవే (నిజముగ) (2) ||పరదేశుల||
ధర ధాన్యంబులు దరగక మానవు
పని పాటలు పోయె (నిజముగ) (2) ||పరదేశుల||
ఎన్ని నాళ్ళు మన మిలలో బ్రతికిన
మన్నై పోవునుగా (దేహము) (2) ||పరదేశుల||
వచ్చితి మిచటికి వట్టి హస్తముల
దెచ్చిన దేదియు లే (దు గదా) (2) ||పరదేశుల||
ఎట్లు వచ్చితిమి ఈ లోకమునకు
అట్లు వెళ్ళవలయున్ (మింటికి) (2) ||పరదేశుల||
యేసు నందు విశ్వాసం బుంచిన
వాసిగ నిను జేర్చున్ (బరమున) (2) ||పరదేశుల||
యేసే మార్గము యేసే సత్యము
యేసే జీవముగా (నిజముగ) (2) ||పరదేశుల||
paradeshulamo priyulaaraa mana
puramidi gaadepudu (nijamuga) (2) ||paradeshula||
chithra vasthuvulu chelledi yokavi
chithramaina santha (lokamu) (2) ||paradeshula||
santha gollu kshama sadalina chandam
banthayu saddanagan (nijamuga) (2) ||paradeshula||
sthiramani nammaku dhara yevvarikini
baralokame sthiramu (nijamuga) (2) ||paradeshula||
medalu middelu melagu sarakulu
paadai kanabadave (nijamuga) (2) ||paradeshula||
dhara dhaanyambulu daragaka maanavu
pani paatalu poye (nijamuga) (2) ||paradeshula||
enni naallu mana milalo brathikina
mannai povunugaa (dehamu) (2) ||paradeshula||
vahchithi michatiki vatti hasthamula
dechchina dediyu le (du gadaa) (2) ||paradeshula||
etlu vachchithimi yee lokamunaku
atlu vellavalayun (mintiki) (2) ||paradeshula||
yesu nandu vishwaasam bunchina
vaasiga ninu jerchun (baramuna) (2) ||paradeshula||
yese maargamu yese sathyamu
yese jeevamugaa (nijamuga) (2) ||paradeshula||