putte yesudu nedu manaku punya maargamu joopanuపుట్టె యేసుడు నేడు మనకు పుణ్య మార్గము జూపను
పుట్టె యేసుడు నేడు – మనకు – పుణ్య మార్గము జూపను
పట్టి యయ్యె బరమ గురుఁడు – ప్రాయశ్చిత్తుడు శ్రీ యేసు ||పుట్టె||
ధర బిశాచిని వేడిన – దు –ర్నరుల బ్రోచుటకై యా
పరమవాసి పాపహరుఁడు – వరభక్త జన పోషుడు (2) ||పుట్టె||
యూద దేశములోన – బెత్లె -హేమను గ్రామమున
నాదరింప నుద్భవించెను – అధములమైన మనలను (2) ||పుట్టె||
తూర్పు దేశపు జ్ఞానులు – పూర్వ – దిక్కు చుక్కను గాంచి
సర్వోన్నతుని మరియ తనయుని – మ్రొక్కిరి అర్పణంబులిచ్చిరి (2) ||పుట్టె||
putte yesudu nedu – manaku punya maargamu joopanu
patti yayye parama gurudu – praayaschitthudu shree yesu ||putte||
dhara bishaachimi vedina – du-rnarula brochutakai yaa
parama vaasi paapaharudu – varabhaktha poshudu (2) ||putte||
yooda deshamulona – bethle-hemanu graamamuna
naadarimpa nudbhavinchenu – adhamulamaina manalanu (2) ||putte||
thoorpu deshapu gnaanulu – poorva – dikku chukkanu gaanchi
sarvonnathuni mariya thanayuni – mrokkiri arpanambulichchiri (2) ||putte||