phalamulanaashinchina paraloka thandriఫలములనాశించిన పరలోక తండ్రి
ఫలములనాశించిన పరలోక తండ్రి
తేరి చూచుచున్నాడు నీ వైపు (2)
ప్రేమతో నిను పెంచిన ప్రియ తోటమాలి
పరీక్షించుచున్నాడు నీ కాపు (2)
ఫలియించకుండుట నీకు న్యాయమా
యజమాని సహనముతో చెలగాటమా (2)
ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడు
సంఘ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు (2)
చుట్టు త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు (2)
తన స్వాస్థ్యముగా నిను ప్రత్యేకపరచినాడు (2) ||ఫలియించకుండుట||
వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేక యుంటే
ఆకులతో నిను చూసి తండ్రి సంతసించునా (2)
ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే (2)
మోడులాంటి నిన్ను ఇంక నరికివేయకుండునా (2) ||ఫలియించకుండుట||
phalamulanaashinchina paraloka thandri
theri choochuchunnaadu nee vaipu (2)
prematho ninu penchina priya thotamaali
pareekshinchuchunnaadu nee kaapu (2)
phaliyinchakunduta neeku nyaayamaa
yajamaani sahanamutho chelagaatamaa (2)
aiguputhu nundi periki thechchinaadu
sangha draaksha thotalo ninnu naatinaadu (2)
chuttu thravvi eruvu vesi neeru posinaadu (2)
thana swaasthyamugaa ninu prathyekaparachinaadu (2) ||phaliyinchakunduta||
vedakinappudu nee yodda phalamu leka yunte
aakulatho ninu choosi thandri santhasinchunaa (2)
ivvabadina samayamulo vardhillakunte (2)
modulaanti ninnu inka narikiveyakundunaa (2) ||phaliyinchakunduta||