mahimagala thandri manchi vyavasaayakuduమహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు
మహిమగల తండ్రి – మంచి వ్యవసాయకుడు
మహితోటలో నర మొక్కలు నాటించాడు (2)
తన పుత్రుని రక్తనీరు – తడి కట్టి పెంచాడు
తన పరిశుద్ధాత్మను – కాపుగా వుంచాడు (2)
కాయవే తోటా – కమ్మని కాయలు
పండవే చెట్టా – తియ్యని ఫలములు (2) ||మహిమ||
నీతి పూత జాతి కర్త – ఆత్మ సుతా ఫలములు
నీ తండ్రి నిలువచేయు – నిత్య జీవ ఫలములు (2)
అనంతమైన ఆత్మ బంధ – అమర సుధా కాంతులు (2)
అనుకూల సమయమయ్యె – పూయు పరమ పూతలు (2) ||కాయవే||
అపవాది కంటబడి – కుంటుబడి పోకు
కాపుకొచ్చి చేదు పండ్లు – గంపలుగా కాయకు (2)
అదిగో గొడ్డలి వేరు – పదును పెట్టియున్నది (2)
వెర్రిగా చుక్కలనంటి – ఎదిగి విర్రవీగకు (2) ||కాయవే||
కలువరి కొండలో పుట్టి – పారిన కరుణా నిధి
కలుషమైన చీడ పీడ – కడిగిన ప్రేమానిధి (2)
నిజముగాను నీవు – నీ సొత్తు కావు (2)
యజమాని వస్తాడు – ఏమి ఫలములిస్తావు (2) ||కాయవే||
ముద్దుగా పెంచాడు – మొద్దుగా నుండకు
మోదమెంతో ఉంచాడు – మోడుబారి పోకు (2)
ముండ్ల పొదలలో కృంగి – మెత్తబడి పోకు (2)
పండ్లు కోయ వచ్చువాడు – అగ్నివేసి పోతాడు (2) ||కాయవే||
mahimagala thandri – manchi vyavasaayakudu
mahi thotalo nara mokkalu naatinchaadu (2)
thana puthruni raktha neeru – thadi katti penchaadu
thana parishuddhaathmanu – kaapugaa unchaadu (2)
kaayave thotaa – kammani kaayalu
pandave chettaa – thiyyani phalamulu (2) ||mahima||
neethi pootha jaathi kartha – aathma suthaa phalamulu
nee thandri nilva cheyu – nithya jeeva nidhulu (2)
ananthamaina aathma bandha – amara sudhaa kaanthulu (2)
anukoola samayamayye – pooyu parama poothalu (2) ||kaayave||
apavaadi kantabadi – kuntubadi poku
kaapukochchi chedu pandlu – gampalugaa kaayaku (2)
adigo goddali veru – padunu pettiyunnadi (2)
verrigaa chukkalananti – edigi virraveegaku (2) ||kaayave||
kaluvari kondalo putti – paarina karunaa nidhi
kalushamaina cheeda peeda – kadigina premaanidhi (2)
nijamugaanu neevu – nee sotthu kaavu (2)
yajamaani vasthaadu – emi phalamulisthaavu (2) ||kaayave||
muddugaa penchaadu – moddugaa nundaku
modamentho unchaadu – modubaari poku (2)
mundla podalalo krungi – metthabadi poku (2)
pandlu koya vachchuvaadu – agnivesi pothaadu (2) ||kaayave||