sari cheyumo devaaసరి చేయుమో దేవా
సరి చేయుమో దేవా
నన్ను బలపరచుమో ప్రభువా (2)
నీ ఆత్మతో నను అభిషేకించి
సరి చేయుమో దేవా (2) ||సరి||
దూరమైతి నీ సన్నిధి విడచి
పారిపోతి నీ గాయము రేపి
లోకమునే స్నేహించితి నేను
పాపము మదిలో నింపుకున్నాను (2)
అది తప్పని తెలిసి తిరిగి వచ్చి
నీ సన్నిధిలో నే మోకరించి (2)
బ్రతిమాలుచున్నాను
నన్ను సరి చేయుమో దేవా (2) ||సరి||
నింపుము నీ వాక్యమును మదిలో
పెంచుము నను నీ పాలనలో
శోధనను గెలిచే ప్రతి మార్గం
ఇవ్వుము నాకు ప్రతి క్షణము (2)
నీ సన్నిధిలో ఒక దినమైనను
వేవేల దినములకంటే శ్రేష్టము (2)
అని తెలుసుకున్నాను
నన్ను సరి చేయుమో దేవా (2) ||సరి||
sari cheyumo devaa
nannu balaparachumo prabhuvaa (2)
nee aathmatho nanu abhishekinchi
sari cheyumo devaa (2) ||sari||
dooramaithi nee sannidhi vidachi
paaripothi nee gaayamu repi
lokamune snehinchithi nenu
paapamu madilo nimpukunnaanu (2)
adi thappani thelasi thirigi vachchi
nee sannidhilo ne mokarinchi (2)
brathimaaluchunnaanu
nannu sari cheyumo devaaa (2) ||sari||
nimpumu nee vaakyamunu madilo
penchumu nanu nee paalanalo
shodhananu geliche prathi maargam
ivvumu naaku prathi kshanamu (2)
nee sannidhilo oka dinamainanu
vevela dinamulakante shreshtamu (2)
ani thelusukunnaanu
nannu sari cheyumo devaa (2) ||sari||