• waytochurch.com logo
Song # 147

nee rakthame నీ రక్తమే నీ రక్తమేనన్ శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము


పల్లవి:
నీ రక్తమే నీ రక్తమేనన్ - శుద్ధీకరించున్ - నీ రక్తమే నా బలము

నీ రక్తధారలేయిల - పాపికాశ్రయంబిచ్చును

పరిశుద్ధ తండ్రి పాపిని - కడిగి పావన పరచుము

1.
నశించు వారికి నీ సిలువ - వెర్రితనముగా నున్నది

రక్షింపబడుచున్న పాపికి - దేవుని శక్తియై యున్నది
...నీ రక్తమే...

2.
నీ సిలువలో కార్చినట్టి - విలువైన రక్తములోన

పరమ పావన కడుగుము - పవిత్ర పరచుము పాపిని
...నీ రక్తమే...

3.
పందివలె పొర్లిన నన్ను - కుక్క వలె తిరిగిన నన్ను

ప్రేమతొ చేర్చుకొంటివి - ప్రేమార్హ నీకె స్తోత్రము
...నీ రక్తమే...

4.
నన్ వెంబడించు సాతాన్ - నన్ బెదరించు సాతానున్

దును మాడేది నీ రక్తమే - దహించేది నీ రక్తమే
...నీ రక్తమే...

5.
స్తుతి మహిమ ఘనతయు - యుగ యుగంబులకు

స్తుతి పాత్ర నీకె చెల్లును - స్తోత్రార్హ నీకె తగును
...నీ రక్తమే...


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com