neevu chesina upakaaramulaku నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును
పల్లవి: నీవు చేసిన ఉపకారములకు - నేనేమి చెల్లింతును (2x) ఏడాది దూడలనా - వేలాది పొట్టేళ్ళనా (2x) ...నీవు చేసిన... 1. వేలాది నదులంత విస్తార తైలము - నీకిచ్చినా చాలునా (2x) గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని - నీకిచ్చినా చాలునా (2x) ...ఏడాది... 2. మరణ పాత్రుడనైయున్న నాకై - మరణించితివి సిల్వలో (2X) కరుణ చూపి నీ దివ్య మార్గాన - నడిపించితివి యేసయ్యా (2X) ...ఏడాది... 3. విరిగి నలిగిన బలియాగముగను - నా హృదయమర్పింతునూ (2X) రక్షణ పాత్రను చేబూని నిత్యం - నిను వెంబడించేదను (2X) ...ఏడాది... 4. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందున - నేనేమి చెల్లింతునూ (2X) కపట మనస్సు లేనట్టి హృదయాన్ని - అర్పింతునోయేసయ్యా (2X)