• waytochurch.com logo
Song # 153

o sadbhakthulara ఓ సద్భక్తులారా లోక రక్షకుండు బెత్లె్హేమందు నేడు


1.
ఓ సద్భక్తులారా! లోక రక్షకుండు - బెత్లె్హేమందు నేడు

జన్మీంచెన్ - రాజాధిరాజు ప్రభువైన యేసు - నమస్కరింప రండి

నమస్కరింప రండి నమస్కరింప రండి - యుత్సాహముతో

2.
సర్వేశ్వరుండు నరరూపమెత్తి - కన్యకు బుట్టి నేడు వేంచేసెన్

మానవజన్మ మెత్తిన శ్రీ యేసూ - నీకు నమస్కరించి నీకు

నమస్కరించి నీకు నమస్కరించి - పూజింతుము

3.
ఓ దూతలారా! ఉత్సహించి పాడి - రక్షకుండైన యేసున్ స్తుతించుడి

పరాత్పరుండా - నీకు స్తోత్రమంచు - నమస్కరింప రండి

నమస్కరింప రండి నమస్కరింప రండి - యుత్సాహముతో

4.
యేసు! ధ్యానించి నీ పవిత్ర జన్మ - మీ వేళ స్తోత్రము నర్పింతుము

అనాది వాక్య మాయె నరరూపు నమస్కరింప రండి

నమస్కరింప రండి నమస్కరింప రండి - యుత్సాహముతో


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com