pradhana yesuni sandharshana ప్రార్ధన యేసుని సందర్శన పరమ తండ్రితో సంభాషణ
పల్లవి: ప్రార్ధన యేసుని సందర్శన - పరమ తండ్రితో సంభాషణ 1. కరములెత్తి ప్రార్ధించగా - పరమ తండ్రి కౌగిలించును స్వరమునెత్తి ప్రార్ధించగా - మధుర స్వరముతొ మాటాడును ...ప్రార్ధన... 2. తండ్రి అని నే పిలువగా - తనయుడా అని తా బల్కును ఆదుకొనును అన్ని వేళలా - కన్నీరంతయు తుడిచివేయున్ ...ప్రార్ధన... 3. మోకరించి ప్రార్ధించగా - సమీపముగా వేంచేయును మనవులెల్ల మన్నించును - మహిమతో నలంకారించును ...ప్రార్ధన... 4. కుటుంబముతో ప్రార్ధించగా - కొదువ ఏమియు లేకుండును ఐక్యతలో నివసించును - శాశ్వత జీవము అచటుండును ...ప్రార్ధన... 5. సంఘముగను ప్రార్ధించగా - కూడిన చోటు కంపించును పరిశుద్ధాత్ముడు దిగివచ్చును - ఆత్మ వరములతో నింపును ...ప్రార్ధన... 6. ఉపవాసముతో ప్రార్ధించగా - కీడులన్నియు తొలగిపోవును కొట్లు ధాన్యముతో నింపును - క్రొత్త పానము త్రాగించును ...ప్రార్ధన... 7. ఏకాంతముగా ప్రార్ధించగా - నీతిని నాకు నేర్పించును యేసు రూపము నాకిచ్చును - యేసు రాజ్యము నను చేర్చును ...ప్రార్ధన...