randi yuchahinchi paadudhamu రండి యుత్చాహించి పాడుదము రక్షణదుర్గము మన ప్రభువే
పల్లవి: రండి యుత్చాహించి పాడుదము - రక్షణదుర్గము మన ప్రభువే 1. రండి కృతజ్ఞత స్తో్త్రముతో - రారాజు సన్నిధి కేగుదము సత్ప్రభునామము కీర్తనలన్ - సంతోష గానము చేయుదము ...రండి... 2. మన ప్రభువే మహదేవుండు - ఘన మహత్మ్యము గల రాజు భూమ్యాగాధపు లోయలును - భూతల శిఖరములాయనవే ...రండి... 3. సముద్రము సృష్టించె నాయననే - సత్యుని హస్తమే భువిఁ జేసెన్ ఆయన దైవము పాలితుల - ఆయన మేపెడి గొఱ్ఱెలము ...రండి... 4. ఆ ప్రభు సన్నిధి మోకరించి - ఆయన ముందర మ్రొక్కుదము ఆయన మాటలు గైకొనిన - నయ్యవి మీకెంత మేలగును ...రండి... 5. తండ్రికుమార శద్ధాత్మకును - దగుస్తుతి మహిమలు కల్గుగాక ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు - నయినట్లు యుగములనౌను ఆమేన్ ...రండి...