siluva chentha cherina nade సిలువ చెంత చేరిననాడు కలుషములను కడిగివేయు
పల్లవి: సిలువ చెంత చేరిననాడు - కలుషములను కడిగివేయు పౌలు వలెను సీల వలెను - సిద్ధపడిన భక్తుల జూచి ...సిలువ... 1. కొండవంటి బండవంటి - మొండి హృదయంబు మండించు పండియున్న పాపులనైన - పిలుచుచుండె పరము చేర ...సిలువ... 2. వంద గొఱ్ఱెల మంద నుండి - ఒకటి తప్పి ఒంటరియాయె తొంబదితొమ్మిది గొఱ్ఱెలవిడచి - ఒంటరియైన గొఱ్ఱెను వెదకెన్ ...సిలువ... 3. తప్పిపొయిన కుమారుండు - తండ్రిని విడచి తరలిపొయె తప్పు తెలిసి తిరిగిరాగా - తండ్రి యతని చేర్చుకొనెను ...సిలువ... 4. పాపి రావా పాపము విడచి - పరిశుద్ధు విందులొ చేర పాపుల గతిని పరికించితివా - పాతాళంబే వారి యంతము ...సిలువ...