• waytochurch.com logo
Song # 162

sthuthi yagamu na yesuke స్తుతి యాగము నా యేసుకే అర్పించెదను ఎల్లప్పుడు


పల్లవి:
స్తుతి యాగము నా యేసుకే - అర్పించెదను - ఎల్లప్పుడు

1.
నా శ్రమ దినమున నాకు జవాబిచ్చి - ప్రతి నిముషము నా మార్గములొ

నన్ను నడిపిన కృపను తలంచి - స్తుతులర్పించెదను - నీకె
...స్తుతి...

2.
ఓదార్పు లేనట్టి చీకటి వేళలో - ఆదరణ కర్తవు నాకు నీవు

మారా అనుభవం మార్చి ఇలలొ - సంతసమిచ్చితివి - నిత్య
...స్తుతి...

3.
రక్షక నీవే నా శైలము బలమును - యుద్ధ దినములో నాకేడము

సాతాను అస్త్రములు ఆర్పివేసి - జయము నొసగితివి - గోప్ప
...స్తుతి...

4.
దేవుని సెలవు లేనిది ఏదయు - జరుగదుగా అని గ్రహించితిని

నా జీవితములో ప్రతి దినమును - మేలుకొరకే గదా కల్గెను
...స్తుతి...

5.
ఆర్భటించు సీయోన్ హర్షించు - షాలేమా నీ యేసు నీతోనె యుండెనుగా

ఆయన మనకు ఆదియు అంతము - పాడెద హల్లెలూయ ఆమేన్
...స్తుతి...


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com