sthuthi yagamu na yesuke స్తుతి యాగము నా యేసుకే అర్పించెదను ఎల్లప్పుడు
పల్లవి: స్తుతి యాగము నా యేసుకే - అర్పించెదను - ఎల్లప్పుడు 1. నా శ్రమ దినమున నాకు జవాబిచ్చి - ప్రతి నిముషము నా మార్గములొ నన్ను నడిపిన కృపను తలంచి - స్తుతులర్పించెదను - నీకె ...స్తుతి... 2. ఓదార్పు లేనట్టి చీకటి వేళలో - ఆదరణ కర్తవు నాకు నీవు మారా అనుభవం మార్చి ఇలలొ - సంతసమిచ్చితివి - నిత్య ...స్తుతి... 3. రక్షక నీవే నా శైలము బలమును - యుద్ధ దినములో నాకేడము సాతాను అస్త్రములు ఆర్పివేసి - జయము నొసగితివి - గోప్ప ...స్తుతి... 4. దేవుని సెలవు లేనిది ఏదయు - జరుగదుగా అని గ్రహించితిని నా జీవితములో ప్రతి దినమును - మేలుకొరకే గదా కల్గెను ...స్తుతి... 5. ఆర్భటించు సీయోన్ హర్షించు - షాలేమా నీ యేసు నీతోనె యుండెనుగా ఆయన మనకు ఆదియు అంతము - పాడెద హల్లెలూయ ఆమేన్ ...స్తుతి...