sthuthinchedanu stuthinchedanu స్తుతించెదను..స్తుతించెదనూ..
పల్లవి: స్తుతించెదను..స్తుతించెదనూ.. నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము - స్తుతించెదను (2X) 1. ఉన్నత దేవుడు సర్వాధిపతియు - ఉర్విపరిపాలక ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన - ఉత్తమ స్నేహితుని ఉదయం సంధ్యా - ఎల్లప్పుడును - ఉత్సాహధ్వనితో పాడెదను (2X) ...స్తుతించెదను... 2. నాశనకరమైన పాప గుంటనుండి నరక వేదననుండి నన్ను విడిపించి నిలిపిన దేవా - నిర్మలా స్వరూప నీతి సమాధానం సంతోషముతో - నిత్యజీవము నాకీచ్చితివి (2X) ...స్తుతించెదను... 3. పాపము క్షమించి రోగము - బాపి భయమును దీర్చి పవిత్రదాయక పావనమూర్తి - పరిశుద్ధ మిచ్చిన పరమ పాదం శరణ్యం నాకు - పరమరాజా పుణ్యదేవా (2X) ...స్తుతించెదను... 4. తల్లిగర్భమునకు ముందేర్పరచి -దేహము నమర్చియు దక్షిణ బాహుతొ పట్టుకొనిన - దయా సంపూర్ణుడా దిక్కు జయము ఆదరణయు -దయతో అనుగ్రహించితివి (2X) ...స్తుతించెదను... 5. సిలువనెత్తి శ్రమలు సహించ - సేవకు పిలచిన స్నేహ దర్శక వీర యోధ - సంశయ హరక శ్రమలు నింద ఆకలియైన - నీ స్నేహము నుండి ఎడబాపునా (2X) ...స్తుతించెదను...