viswasa vanithalamu విశ్వాస వనితలము ప్రభు యేసు ముద్రికలం
పల్లవి: విశ్వాస వనితలము - ప్రభు యేసు ముద్రికలం (2X) ప్రకటించెదం, ప్రార్ధించెదం, స్తుతియించెదం - ప్రభుకై నిలిచెదము హోసన్నా మహిమ నీకే - యేసన్నా ఘనత నీకే (2X) 1. సాటియైన సహాయముగా - మము సృస్టించాడు మేటియైన ప్రభు కార్యముకై - మము నిలిపాడు చురుకుదనం మా ప్రత్యేకత - ఆతిద్యమే మా నైజం అమ్మగా, ఆలిగా, బలశాలిగా - మము దీవించాడు హోసన్నా మహిమ నీకే - యేసన్నా ఘనత నీకే (2X) ...విశ్వాస... 2. ప్రభుయేసు పునఃరుర్థానం - ప్రకటించింది మేమే (2X) అత్తరు తైలముతో - అభిశేకించింది మేమే ప్రేమ గుణం, త్యాగ గుణం, సుగుణ సుగంధం - మాలో నింపాడు జాలిగా, ప్రేమగా, మేలుగా - మము దీవించాడు హోసన్నా మహిమ నీకే - యేసన్నా ఘనత నీకే (2X) ...విశ్వాస...