yehova naa moralalinchenu యెహోవా నా మొర లాలించను దన మహా దయనుననుగణీంచెను
పల్లవి: యెహోవా నా మొర లాలించను - దన మహా దయనుననుగణీంచెను అహర్నిశల దీన్యహీనూడగు నా - దుహయనెడు ధ్వని గ్రహించమని ...యెహోవా... 1. పెను పిశాచి కడిమి బడగొట్టెను - దన వశాన నను నిలువబెట్టెను - ప్రశాంత మధురసు - విశేష వాక్పల - నిశాంతమున జేర్చి సేద దీర్చెను ...యెహోవా... 2. మదావళము బోలునామదిన్ - దన ప్రదీప్త వాక్యంకుశాహతిన్ - యదేచ్చలన్నీటి గుదించి పాపపు - మెదల్ తుదల్ నరికి దరికి చేర్చెను ...యెహోవా... 3. అనీతి వస్త్రమెడలించెను - యేసునాధు రక్తమున ముంచెను - వినూత్న యత్నమె - దనూని యెన్నడు - గనన్ వినన్ ప్రేమ నాకు జూపెను ...యెహోవా... 4. విలాపములకు జెవి నిచ్చెను - శ్రమ కలాపములకు సెలవిచ్చెను శిలానగము పైకి లాగినను సుఖకళావళుల్ మనసులోన నిలిపెను ...యెహోవా... 5. అగన్య పాపియని త్రోయక - నన్ను గూర్చి తన సుతుని దాచక తెగించి మృతికో - ప్పగించి పాపపు నెగుల్ దిగుల్ సొగసుగానణంచెను