yogyudavo yogyudavo యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభో నీవె యోగ్యుడవో
పల్లవి: యోగ్యుడవో - యోగ్యుడవో యేసు ప్రభో నీవె యోగ్యుడవో మరణము గెల్చిన యొధుడవో - మా జీవితముల పూజ్యుడవో 1. సృష్టికర్తవు నిర్మాణకుడవు - జీవనదాత జీవించువాడా (2X) శిరమును వంచి కరములు జోడించి - స్తుతియించెద నిన్ను యేసు ప్రభో (2X) ...యోగ్యుడవో... 2. గొఱ్ఱెపిల్లవై యాగమైతివి - సిలువయందే పాపమైతివి (2X) శిరమును వంచి కరములు జోడించి - సేవించెద నిన్ను యేసు ప్రభో (2X) ...యోగ్యుడవో... 3. స్నేహితడవై నీవిల కోరితివి - విడువకన్నుఆదుకొంటివి (2X) శిరమును వంచి కరములు జోడించి - భజియించెద నిన్ను యేసు ప్రభో (2X) ...యోగ్యుడవో...