sarva shakthuni sthothragaanamu సర్వశక్తుని స్తోత్రగానము
సర్వశక్తుని స్తోత్రగానము
సల్పరే జగమెల్లను
నిర్వహించును దాస భారము
నిత్యమెద రాజిల్లను (2) ||సర్వ||
ముదముతో నిర్మానకుండగు
మూల కర్తను బాడరే
వదన మీక్ష్మాన్వoచి దేవుని
వందనముతో వేడరే (2) ||సర్వ||
వేదపారాయణము సేయుచు
విశ్వమంత జయింపరే
సాదరముగా దేవు నిక మీ
స్వాoతమున బూజింపరే (2) ||సర్వ||
ఎదను విశ్రాంతిన్ పరేశుని
హెచ్చుఁగా నుతి జేయరే
సదమలంబగు భక్తితో మీ
సర్వ మాయన కీయరే (2) ||సర్వ||
చావు పుట్టుక లేనివాడుగ
సంతతము జీవించును
ఈవులిచ్చుచు దన్ను వేడు మ-
హేష్టులను రక్షించును (2) ||సర్వ||
దాసులై దేవునికి నెదలో
దర్పమును బోగాల్పరే
యేసుక్రీస్తుని పుణ్య వస్త్రము
నే మరక మైదాల్పరే (2) ||సర్వ||
sarva shakthuni sthothragaanamu
salpare jagamellanu
nirvahinchunu daasa bhaaramu
nithyamedha raajillanu (2) ||sarva||
mudamutho nirmaanakundagu
moola karthanu baadare
vadana meekshmaanvanchi devuni
vandanamutho vedare (2) ||sarva||
vedapaaraayanamu seyuchu
vishwamantha jayimpare
saadaramugaa devu nika mee
swaanthamuna boojimpare (2) ||sarva||
edanu vishraanthin pareshuni
hechchugaa nuthi jeyare
sadamalambagu bhakthitho mee
sarva maayana keeyare (2) ||sarva||
chaavu puttuka lenivaaduga
santhathamu jeevinchunu
eevulichchuchu dannu vedu ma-
heshtulanu rakshinchunu (2) ||sarva||
daasulai devuniki nedalo
darpamunu bogaalpare
yesukreesthuni punya vasthramu
ne maraka maidaalpare (2) ||sarva||