aaraadhanalanduko ఆరాధనలందుకో ఆరాధనలందుకో
పల్లవి: ఆరాధనలందుకో ఆరాధనలందుకో... పాప క్షమాపణ జీవమునిచ్చిన - కరుణామయా అందుకో ॥ఆరాధన॥
1. పాపంబున జన్మించి నశియించితిని - లోకంబు నాదనుచు ఆశించితిని ఆయినా నీవు రక్షణ నివ్వ - ప్రేమించి పంపితివి యేసు ప్రభుని ఘనతా మహిమా నీకేయని హల్లెలూయ గానము చేసెదను పాప క్షమాపణ జీవమునిచ్చిన - కరుణామయా అందుకో ఆరాధనలందుకో
2. తెలిసికొంటిని నా యేసు నిన్ను - సర్వ శక్తిగల ప్రభువనియు రానున్నావూ మరల నాకై - ఆనంద దేశములో నన్నుంచుటకై ఘనతా మహిమా నీకేయని హల్లెలూయ గానము చేసెదను పాప క్షమాపణ జీవమునిచ్చిన - కరుణామయా అందుకో ఆరాధనలందుకో
3. అంద సౌందర్యంబులు వ్యర్దమని - ఆశించితి ముత్యంబుగ నుండుటకై నిన్నా నేడు నిరంతరము - మారని మా ప్రభూ నీకే స్తుతులు ఘనతా మహిమా నీకేయని హల్లెలూయ గానము చేసెదను పాప క్షమాపణ జీవమునిచ్చిన - కరుణామయా అందుకో ఆరాధనలందుకో