• waytochurch.com logo
Song # 182

adiginadi konthe ainaa అడిగినది కొంతే అయినా


అడిగినది కొంతే అయినా
పొందినది ఎంతో దేవా
ప్రతిగా ఏమివ్వగలనయ్యా
నిను స్తుతియించె హృదయము తప్ప
నా జీవితం నీకే అంకితమయ్యా ||అడిగినది||

ఊహించలేని వివరింపజాలని
నీ కార్యములు ఆశ్చర్యమే
యోచించినా నా వర్ణనకందని
నీ కృపా కనికరములు అత్యున్నతమే (2)
తరతరములకు మారని నీ ఉన్నత ప్రేమా
యుగయుగములకు నీకే ఘనతా మహిమా
సతతం నిను నే కొనియాడెదను
సకలం నీ నామముకే స్తోత్రము తగును ||అడిగినది||

క్షణ భంగురం నా క్షయ జీవితం
కాచావయ్యా నను నీ రెక్కల నీడ
ఏ యోగ్యత లేని అల్పుడను నన్ను
హెచ్చించావయ్యా నీ ప్రేమ తోడ (2)
నా ఆశ్రయ దుర్గము నీవే యేసయ్య
నా రక్షణ శృంగము నీవే మెస్సయ్య
నా స్తుతికి పాత్రుడవు నీవేనయ్యా
ఈ స్తోత్ర కీర్తన నీకేనయ్యా ||అడిగినది||

మహిమోన్నతుడా నను మరువని విభుడా
ప్రణుతించెదను నిన్నే నిరతం
నిష్కలంకుడా నిర్మలాత్ముడా
ఫ్రచురించెదను నీ పావన చరితం (2)
నా అతిశయము నీవే నా యేసయ్యా
నా ఆధారము నీవే నా మెస్సయ్యా
నా ఆరాధన ఆలాపన నీకేనయ్యా
ఈ దీనుని సేవను చేకొనుమయ్యా ||అడిగినది||

Adiginadi Konthe Ainaa
Pondinadi Entho Devaa
Prathigaa Emivvagalanayyaa
Ninu Sthuthiyinche Hrudayamu Thappa
Naa Jeevitham Neeke Ankithamayyaa ||Adiginadi||

Oohinchaleni Vivarimpajaalani
Nee Kaaryamulu Aascharyame
Yochinchinaa Naa Varnanakandani
Nee Krupaa Kanikaramulu Athyunnathame (2)
Tharatharamulaku Maarani Nee Unnatha Premaa
Yugayugamulaku Neeke Ghanatha Mahimaa
Sathatham Ninu Ne Koniyaadedanu
Sakalam Nee Naamamuke Sthothramu Thagunu ||Adiginadi||

Kshana Bhanguram Naa Kshaya Jeevitham
Kaachaavayyaa Nanu Nee Rekkala Needa
Ae Yogyatha Leni Alpudanu Nannu
Hechchinchaavayyaa Nee Prema Thoda (2)
Naa Aashraya Durgamu Neeve Yesayya
Naa Rakshana Shrungamu Neeve Messaiah
Naa Sthuthiki Paathrudavu Neevenayyaa
Ee Sthothra Keerthana Neekenayyaa ||Adiginadi||

Mahimonnathudaa Nanu Maruvani Vibhudaa
Pranuthinchedanu Ninne Niratham
Nishkalankudaa Nirmalaathmudaa
Prachurinchedanu Nee Paavana Charitham (2)
Naa Athishayamu Neeve Naa Yesayyaa
Naa Aadhaaramu Neeve Naa Messaiah
Naa Aaraadhana Aalaapana Neekenayya
Ee Deenuni Sevanu Chekonumayyaaa ||Adiginadi||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com