• waytochurch.com logo
Song # 18972

naa paapame ninu lokamu cherchenuనా పాపమే నిను లోకము చేర్చెను


నా పాపమే నిను లోకము చేర్చెను
నా దోషమే నిను సిలువను వేసెను (2)
నేనేగా పెంచితి నీ భారం
తండ్రికి నిను చేసితిని దూరం (2) ||నా పాపమే||

ఆ గెత్సేమనే వనములోన నువ్వు చేసిన ఆ ప్రార్థనలో
నీ రుధిరము స్వేదము బిందువులుగా మారి ఎడతెగకుండా కురిసిన (2)
నువ్వు నలుగుట తండ్రి కోరెను
నా పాపము నీపై మోపెను (2)
నువ్వు చూపిన వినయమే కాదా?
నా పాలిట వెలకట్టని క్రయధనముగ మారెను ||నా పాపమే||

ఆ సిలువలో, నీ బాధలలో చూచితిని నా పాపము
నీ ప్రేమతో కార్చిన రుధిరం చెల్లించేను నా మూల్యము (2)
ఈ మరణము నా కోసమే
నీ యాతన నా లోపమే (2)
ఏమున్నది నాలోన ఘనము
నీ ప్రాణము పెట్టి నన్ను చేర్చితివి పరము ||నా పాపమే||

naa paapame ninu lokamu cherchenu
naa doshame ninu siluvanu vesenu (2)
nenegaa penchithi nee bhaaram
thandriki ninu chesithini dooram (2) ||naa paapame||

aa gethsemane vanamulona nuvvu chesina aa praardhanalo
nee rudhiramu swedhamu binduvulugaa maari edathegakundaa kurisina (2)
nuvvu naluguta thandri korenu
naa paapamu neepai mopenu (2)
nuvvu choopina vinayame kaadaa?
naa paalita velakattani krayadhanamuga maarenu ||naa paapame||

aa siluvalo nee baadhalalo choochithini naa paapamu
nee prematho kaarchina rudhiram chellinchenu naa moolyamu (2)
ee maranamu naa kosame
nee yaathana naa lopame (2)
emunnadi naalona ghanamu
nee praanamu petti nannu cherchithivi paramu ||naa paapame||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com