• waytochurch.com logo
Song # 19931

jeevithaanthamu varaku neeke seva salpudunantini జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని


జీవితాంతము వరకు నీకే – సేవ సల్పుదునంటిని
నీవు నాతో నుండి ధైర్యము – నిచ్చి నడుపుము రక్షకా ||జీవితాంతము||

ఎన్ని యాటంకంబులున్నను – ఎన్ని భయములు కల్గిన
అన్ని పోవును నీవు నాకడ – నున్న నిజమిది రక్షకా ||జీవితాంతము||

అన్ని వేళల నీవు చెంతనె – యున్న యను భవమీయవె
తిన్నగా నీ మార్గమందున – పూనినడచెద రక్షకా ||జీవితాంతము||

నేత్రములు మిరుమిట్లు గొలిపెడి – చిత్రదృశ్యములున్నను
శత్రువగు సాతాను గెల్వను – చాలు నీ కృప రక్షకా ||జీవితాంతము||

నాదు హృదయమునందు వెలుపట – నావరించిన శత్రులన్
చెదర గొట్టుము రూపుమాపుము – శ్రీఘ్రముగ నారక్షకా ||జీవితాంతము||

మహిమలో నీవుండు చోటికి – మమ్ము జేర్చెదనంటివే
ఇహము దాటినదాక నిన్ను – వీడనంటిని రక్షకా ||జీవితాంతము||

పాప మార్గము దరికి బోవక – పాత యాశల గోరక
ఎపుడు నిన్నే వెంబడింపగ – కృప నొసంగుము రక్షకా ||జీవితాంతము||

jeevithaanthamu varaku neeke – seva salpudunantini
neevu naatho nundi dhairyamu – nichchi nadupumu rakshakaa
||jeevithaanthamu||

enni yaatankambulunnanu – enni bhayamulu kalgina
anni povunu neevu naakada – nunna nijamidi rakshakaa ||jeevithaanthamu||

anni velala neevu chenthane – yunna yanubhavameeyave
thinnagaa nee maargamanduna – pooni nadacheda rakshakaa ||jeevithaanthamu||

nethramulu mirumitlu golipedi – chithra drushyamulunnanu
shathruvagu saathaanu gelvanu – chaalu nee krupa rakshakaa ||jeevithaanthamu||

naadu hrudayamunandu velupata – naavarinchina shathrulan
chedara gottumu roopumaapumu – sheeghramuga naa rakshakaa ||jeevithaanthamu||

mahimalo neevundu chotiki – mammu jerchedanantive
ihamu daatina daaka ninnu – veedanantini rakshakaa ||jeevithaanthamu||

paapa maargamu dariki bovaka – paatha yaashala goraka
epudu ninne vembadimpaga – krupa nosangumu rakshakaa ||jeevithaanthamu||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com