neetho sooryudavai veluguthunna yesayya నీతి సూర్యుడవై వెలుగుతున్న యేసయ్య
నీతి సూర్యుడవై వెలుగుతున్న యేసయ్య
నీ ఏర్పాటులోన నీ దేహము మేమయ్య (2)
నీదు రక్షణతో మమ్ము కాచినందుకు
నీదు సంఘముగా మమ్ము నిలిపినందుకు (2)
నీకే వందనం – నీకే వందనం
నీకే వందనం – యేసు రాజ వందనం (2) ||నీతి||
త్వరలో రానై ఉన్నావయ్యా మా ప్రభువా
నీదు విందులోన చేరాలని మా దేవా (2)
సిద్ధపాటుకై కృపలను చూపుమని
నిన్నే వేడితిమి నీవే మా బలమని (2) ||నీకే||
నీ నామము రుచిని ఎరిగిన వారము మేము
నిరతము నీ మంచి మన్నాతో బ్రతికెదము (2)
నీ ఆశ్రయములో కురిసెను దీవెనలు
నీలో నిలిచెదము చాటగా నీ తేజము (2) ||నీకే||
neetho sooryudavai veluguthunna yesayya
nee erpaatulona nee dehamu memayya (2)
needu rakshanatho mammu kaachinanduku
needu sanghamugaa mammu nilipinanduku (2)
neeke vandanam – neeke vandanam
neeke vandanam – yesu raaja vandanam (2) ||neethi||
thvaralo raani unnaavayyaa maa prabhuvaa
needu vindulona cheraalani maa devaa (2)
siddapaatukai krupalanu choopumani
ninne vedithimi neeve maa balamani (2) ||neeke||
nee naamamu ruchini erigina vaaranamu memu
nirathamu nee manchi mannaatho brathikedamu (2)
nee aashrayamulo kurisenu deevenalu
neelo nilichedamu chaatagaa nee thejamu (2) ||neeke||