• waytochurch.com logo
Song # 19971

Naadhu Rakshaka ni manase uttamam నాదు రక్షకా నీ మనసే ఉత్తమం దిన దినము నీతోనే వసియింతును

నాదు రక్షకా నీ మనసే ఉత్తమం - దిన దినము నీతోనే వసియింతును (2)
నేనేది పలికినను - ఏమి చేసినను (2)
నీ ప్రేమనే కనుపరతును - నీ శక్తినే కొనియాడేదన్
నాదు రక్షకా నీ మనసే ఉత్తమం - దిన దినము నీతోనే వసియింతును (2)

నా హృదిలో నీ వాక్యము నివశింపని – ప్రతి క్షణము ప్రతి దినము ధ్యానింతును (2)
లోకము నను విడచిన - నీవు విడువలేదు (2)
నాకు జయము జయము నీ శక్తితోనే (2)
నాదు రక్షకా నీ మనసే ఉత్తమం - దిన దినము నీతోనే వసియింతును (2)

నా తండ్రి నా విభుడా పాలించుమా – ఆదరణ నా హృదిలోన నింపుమయ్యా (2)
మనుజులు నన్ను మరచిన – నీవు మరువలేదు (2)
నాకు జయము జయము నీ ప్రేమతోనే (2)

నాదు రక్షకా నీ మనసే ఉత్తమం - దిన దినము నీతోనే వసియింతును (2)
నేనేది పలికినను - ఏమి చేసినను (2)
నీ ప్రేమనే కనుపరతును - నీ శక్తినే కొనియాడేదన్
నాదు రక్షకా నీ మనసే ఉత్తమం - దిన దినము నీతోనే వసియింతును (2)

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com