Kalyaname Vaibhogam కళ్యాణమే వైభోగం – కమనీయ కాంతుల దీపం
కళ్యాణమే వైభోగం – కమనీయ కాంతుల దీపం /2/ శ్రుతిలయల సుమధుర గీతం /2/దైవ రచిత సుందర కావ్యం /కళ్యాణమే/పరమ దైవమె ప్ర్రారంభించిన పరిశుద్ధమైన కార్యం /2/నరుని మంచికై తన చేతులతో ప్రభు రాసిచ్చిన పత్రం /కళ్యాణమే/కీడు తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షంమోడుగానున్న జీవితాలు /2/ చిగురింపజేసే వసంతం /కళ్యాణమే/దేవదూతలే తొంగిచూసేటి దృశ్యంభావమధురిమలు పొంగజేసేటి /2/ కమనీయమైన చిత్రం /కళ్యాణమే/