• waytochurch.com logo
Song # 20038

Siramu Vanchenu sarva lokam శిరము వంచెను సర్వ లొకమ్ – యేసు దేవా నీ ముందు


శిరము వంచెను సర్వ లొకమ్ – యేసు దేవా నీ ముందు /2/
సంతసించె ప్రతి హృదయం /2/- రక్షక నీ జన్మయందు /2/శిరము/

1. పుట్టిపెరిగి రాజులయ్యేది సహజము – రాజుగానే ఉదయించినావు చిత్రము /2/
మహిమ సింహాసనం – విడిచి నాకోసము/2/
పశుల పాకలో పుట్టినావు స్తోత్రము /2/శిరము/

2. యుద్హముచేసి రాజ్యమేలేది సహజము – శాంతి రాజ్యము స్తాపించినావు చిత్రము/2/
పరలోకానందము – చేసితివి త్యాగము /2/
మంటిదేహము దాల్చినావు స్తోత్రము /2/శిరము/

3. పుట్టి ఒకడు తనను యెరుగుట సహజము – ముందే యెరిగి జన్మించినావు చిత్రము /2/
మార్పు చేసుకొని నీ మహిమ రూపము /2/
మనిషి రూపులో – వచ్చినావు స్తోత్రము /2/శిరము/


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com