yesu deva needu raaka lokamanta velugu rekha యేసు దేవా నీదు రాక – లోకమంతా వెలుగు రేఖ
యేసు దేవా నీదు రాక – లోకమంతా వెలుగు రేఖ రోత బ్రతుకే పశువుల పాక – మారెను ప్రార్ధన ధూపవేదిక యేసు దేవా నీదు రాక – లోకమంతా వెలుగు రేఖ 1. రక్షకుని ఇల మందిరము – కన్య మరియ దీన దేహము మంటి ఘటము నాశరీరము /2/ఆత్మ దేవుని ఆలయము /2/యేసు/2. సర్వజనులకు మహానందము సర్వకాలము – సమాధానము పర్వదినము యేసు జననము /2/దేవదూతల స్తోత్ర గానము /2/యేసు/3. పరమపురికి మార్గమాతడు మరణమైన మరియ సుతుడు /2/మృతిని గెల్చిన మహిమరేడు /2/మరల వచ్చును ఎదురు చూడు /2/యేసు/