• waytochurch.com logo
Song # 20074

ఏం వింతరో ఇదేం కాంతిరో - జనులందరికీ మహా సంబరమంటరో

em vintharao idhem kanthiro


ఏం వింతరో ఇదేం కాంతిరో - జనులందరికీ మహా సంబరమంటరో
ఆ ఎలుగు సూడలేక కళ్ళు సెదిరిపోయే
సంతోషం పట్టలేక మనసు మూగబాయె

1. పశువుల తొట్టిలో పొత్తిగుడ్డల చుట్టలో
మన సింతలు దీర్చోడు మన బాధలు బాపోడు
దావీదు పురములో రక్షకుడు ఎలిసె
ఆలస్యమేల ఇక ఆనవాలు తెలిసె

2. రెక్కలు విప్పుకొని సక్కసక్కని దూతలు
సమాధానమంటూ పాడుతుండ్రు పాటలు
పామరులం మనకే ముందుగా తెలిసె
గొప్పోళ్ళ సిగ్గుదీయ మనకు దారి తెరిచె

3. మెస్సీయ వస్తని ఎదురుచూస్తే ఇంతదాక
వచ్చిండదిగో సూడు మురుస్తుంది పసులపాక
వినవచ్చుచున్నది సక్కగాను శిశువు కేక
సాటుదాం అందరికీ రక్షకుడు యేసురాక


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2025 Waytochurch.com