raare choothamu raaja suthuni రారే చూతము రాజసుతుని
రారే చూతము రాజసుతుని
రేయి జనన మాయెను (2)
రాజులకు రారాజు మెస్సయ్యా (2)
రాజితంబగు తేజమదిగో (2) ||రారే||
దూత గణములన్ దేరి చూడరే
దైవ వాక్కులన్ దెల్పగా (2)
దేవుడే మన దీనరూపున (2)
ధరణి కరిగె-నీ దినమున (2) ||రారే||
కల్లగాదిది కలయు గాదిది
గొల్ల బోయుల దర్శనం (2)
తెల్లగానదే తేజరిల్లెడి (2)
తార గాంచరే త్వరగ రారే (2) ||రారే||
బాలు-డడుగో వేల సూర్యుల
బోలు సద్గుణ శీలుడు (2)
బాల బాలిక బాలవృద్ధుల (2)
నేల గల్గిన నాథుడు (2) ||రారే||
యూదవంశము నుద్ధరింప
దావీదుపురమున నుద్భవించె (2)
సదమలంబగు మదిని గొల్చిన (2)
సర్వ జనులకు సార్వభౌముడు (2) ||రారే||
raare choothamu raaja suthuni
reyi jananamaayenu (2)
raajulaku raaraaju messayyaa (2)
raajithambagu thejamadigo (2) ||raare||
dootha ganamulan deri choodare
daiva vaakkulan delpagaa (2)
devude mana deena roopuna (2)
dharani karige-nee dinamuna (2) ||raare||
kalla gaadidi kalayu gaadidi
golla boyula darshanam (2)
thellagaanade thejarilledi (2)
thaara gaanchare thvaraga raare (2) ||raare||
baalu-dadugo vela sooryula
bolu sadguna sheeludu (2)
baala baalika baala vrudhdhula (2)
nela-galgina naathudu (2) ||raare||
yooda vamshamu nuddarimpa
daaveedu puramuna nudbhavinche (2)
sadamalambagu madini golchina (2)
sarva janulaku saarvabhoumudu (2) ||raare||