• waytochurch.com logo
Song # 21833

e jeevithamannadhi kshanakaalamainadhi ఈ జీవితమన్నది క్షణకాలమైనది పరలోకంలోనిది శాశ్వతమైనది


ఈ జీవితమన్నది క్షణకాలమైనది పరలోకంలోనిది శాశ్వతమైనది || 2 ||
ఆస్తులు ఎన్ని ఉన్న అంతస్తులు ఎన్ని ఉన్న
క్రీస్తు లేని ఈ జీవితం ఈ లోకంలో సున్నా || 2 || ఈ జీవితమన్నది ||

గొప్ప ప్రణాళికా నాకై సిద్దము చేసి తల్లి గర్భంలో రూపించావు || 2 ||
సృష్టాంతటిని నీ నోటిమాట ద్వారా చేసావు
పరిశుద్ధమైన చేతులతో నన్ను చెక్కావు || 2 ||
ఈ సృష్టిపై ఉన్న ప్రేమకంటే నాపై ఉన్న || 2 ||
కలువారి సిలువపై ప్రాణం పెట్టి కనుపరిచావయ్యా || 2 || ఈ జీవితమన్నది ||

ఉన్నతమైన స్థితిని నాకై నీవు సిద్దము చేసి
నీ వాక్యమును ప్రకటించుటకు నన్ను ఏర్పరిచావు || 2 ||
తప్పిపోయిన నన్ను నీవు రక్షించుటకై
దీనునిగా ఈ భువిపై నీవు జన్మించావు || 2 ||
ఈ సృష్టిపై ఉన్న ప్రేమకంటే నాపై ఉన్న || 2 ||
కలువారి సిలువపై ప్రాణం పెట్టి కనుపరిచావయ్యా || 2 || ఈ జీవితమన్నది ||

  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2019 Waytochurch.com