Yentho Madhuram Na Yesu Prema ఎంతో మధురం నా యేసు ప్రేమ ఎంతో క్షేమం
ఎంతో మధురం నా యేసు ప్రేమ ఎంతో క్షేమం నా తండ్రి చెంత || 2 ||యెనలేని ప్రేమను నాపైన చూపి ప్రాణంబు పెట్టిన మన తండ్రి ప్రేమ || 2 || ఎంతో మధురం ||నీ నీతికి ఆధారము నా త్రోవకు వెలుగువై || 2 ||దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక || 2 || ఎంతో మధురం ||పరిశుద్దులకు పరిశుద్దుడవు ప్రభులకు ప్రభుడవు నా యేసయ్య || 2 ||ఈ పాపలోకంలో నీ ప్రాణమర్పించి పరలోకమునకు మార్గము చూపావు || 2 || ఎంతో మధురం ||