• waytochurch.com logo
Song # 21862

talli premakanna minna ayina prema తల్లి ప్రేమ కన్నా ఆ ఆఆ మిన్న అయిన ప్రేమ ఆ ఆఆ


తల్లి ప్రేమ కన్నా... ఆ... ఆ...ఆ.... మిన్న అయిన ప్రేమ ... ఆ... ఆ...ఆ....
ప్రాణమిచ్చు ప్రేమ నిత్యముండు ప్రేమ || 2 ||
ప్రేమ యేసయ్య ప్రేమ... ప్రేమ నా యేసు ప్రేమ || 2 || తల్లి ||

తల్లి కడుపులో నే ఉన్నపుడు నా తలవంపులు ఎరిగిన దేవుడవు
నేనేమై యుంటినో అది నీ చిత్తమే నే బ్రతుకు దినములన్ని నీ కోసమే || 2 ||
నా కోసమే నీవు ఈ భువిలో రక్తము చిందించి పాపము కడిగావు
ఎందుకయ్యా నాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా నాపై ఇంత కరుణా || 2 || ప్రేమ ||

నీ శ్వాసను మట్టిలో ఉదకుండినప్పుడే నా కొరకు ప్రణాళిక సిద్దము చేసి
ప్రేమ లేని ఈ లోకంలో ప్రేమను నాకు నీవు పంచావు || 2 ||
నా కోసమే నీవు ఈ భువిలో రక్తము చిందించి పాపము కడిగావు
ఎందుకయ్యా నాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా నాపై ఇంత కరుణా || 2 || ప్రేమ ||

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com