• waytochurch.com logo
Song # 21874

madhuraathi madhuram yesu nee namam మధురాతి మధురం యేసు నీ నామం


సాఖీ: మధురాతి మధురం యేసు నీ నామం... అతి శ్రేష్ఠము యేసు నీ నామం

lపll మధురాతి మధురం యేసు నీ నామం
నా అధరముల పలుకులలో నిత్యమూ నిలిచె నీ నామంll2ll
llమధురాతిll

llచll అన్ని నామముల కన్నా పై నామం నీ నామం
మహిమ గల నీ నామం అతి శ్రేష్ఠము, అతి మధురంll2ll
అద్భుతాలు చేయు నీ నామం అంధకారమును లయపరుచు నీ నామంll2ll
llమధురాతిll

llచll విన్నపాలకు చెవి యొగ్గును విలాపములను పోగొట్టును
మహిమ గల నీ నామం మహిమకు చేర్చు నీ నామంll2ll
మరణపు ముల్లును విరిచెను నీ నామం నిత్య జీవమునిచ్చు నీ నామంll2ll
llమధురాతిll

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2022 Waytochurch.com